News Update :
Home » , , , , , » APPSC (4009 Posts) Notification Released 2016

APPSC (4009 Posts) Notification Released 2016

Penulis : JobsacrossIndia on Monday, 4 July 2016 | 01:57

 Direct Recruitment
ఉద్యోగార్థులకు తీపి కబురు! మరో నాలుగు వారాల్లో రాష్ట్రంలో ఉద్యోగాల పండుగకు ఏపీపీఎస్సీ తెరతీయనుంది. దాదాపు 4009 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిన నేపథ్యంలో ఆయా పోస్టుల భర్తీ ప్రక్రియ త్వరలోనే పట్టాలెక్కనుంది. అదేవిధంగా ఎప్పుడు ప్రకటన వస్తుందో? ఎప్పుడు పోస్టుల భర్తీ చేపడతారో? తెలియని ఆంధ్రప్రదేశ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన(ఏపీపీఎస్సీ)ను గాడిలో పెడతామని కమిషన్‌ చైర్మన్‌ పిన్నమనేని ఉదయ్‌భాస్కర్‌ చెప్పారు. ఈ క్రమంలో ఇక నుంచి ప్రతి సంవత్సరం ఉద్యోగాల భర్తీ చేపడతామని తెలిపారు. అదేవిధంగా ప్రవేశ పరీక్షలు, ఫలితాలు, ఇంటర్వ్యూలు, భర్తీ వంటి అన్ని కార్యకలాపాలను గరిష్టంగా ఆరు మాసాల్లోనే పూర్తి చేయనున్నట్టు వివరించారు. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి మరో నాలుగు వారాల్లో 4009 పోస్టులకు నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నట్టు తెలిపారు. దీనికి ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి అనుమతి లభించిందన్నారు. కష్టపడే అభ్యర్థులకు అవకాశాలు వచ్చే విధంగా ప్రశ్నాపత్రం రూపకల్పన ఉంటుందని, కోచింగ్‌ సెంటర్లకు వెళ్లినవారికే ఉద్యోగావకాశాలు అనేలా తమ విధానం ఉండదని తేల్చిచెప్పారు. అదే సమయంలో ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామంటే నమ్మి మోసపోవద్దని, పూర్తి పారదర్శకతతోనే అన్ని ఖాళీలను భర్తీచేస్తామని ఉదయభాస్కర్‌ స్పష్టం చేశారు. ఆదివారం విజయవాడ వచ్చిన ఆయనను ‘ఆంధ్రజ్యోతి’ పలకరించింది. ఈ సందర్భంగా ఏపీపీఎస్సీకి సంబంధించి పలు అంశాలను ఆయన వెల్లడించారు.

ఈ ఏడాదిలో ఏపీపీఎస్సీ ప్రకటన ఎప్పుడు జారీచేస్తారు?
ప్రభుత్వం 4009 పోస్టులకు అనుమతి ఇచ్చింది. దానికి సంబంధించి విధివిధానాలు వచ్చాయి. ఇంకా జిల్లా, జోన, రోస్టర్‌వైజ్‌ విధానాలు ఖరారు కావల్సి ఉంది. నాలుగు వారాల్లోపు విడతల వారీగా నోటిఫికేషన్లను జారీచేస్తాం. మొదటిగా గ్రూప్‌-1, అనంతరం గ్రూప్‌-2, గ్రూప్‌-3 ప్రకటనలు ఇస్తాం. గ్రూప్‌-1కు దరఖాస్తు చేసుకున్నవాళ్లే గ్రూపు-2, గ్రూప్‌-3కి దరఖాస్తు చేసుకుంటారు. దీనివల్ల మాకు ఇబ్బంది తలెత్తుతోంది. అందుకే పైనుంచి పోస్టులను పూర్తిచేసుకుంటూ వస్తాం. అంతేకాకుండా ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం వయో పరిమితి నిర్ధారిస్తాం. ప్రకటన ఇచ్చే రోజు ఏ లిమిట్‌ ఉంటుందో దాన్నే తీసుకుంటాం. ఒకవేళ ప్రభుత్వం దానిని మార్చే అవకాశం ఉంటే.. దృష్టిలో పెట్టుకుని ప్రకటన విడుదల చేస్తాం.

దరఖాస్తు విధానం? దరఖాస్తులో తప్పులు వచ్చి గతంలో చాలా మంది అభ్యర్థులు నష్టపోయారు, దీనిలో ఏమైనా మార్పులు ఉన్నాయా?
ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌ను సంస్కరించాం. కొత్త వెబ్‌సైట్‌లో ‘వనటైం ప్రొఫైల్‌ రిజిస్ర్టేషన’ విఽధానాన్ని ప్రవేశపెట్టాం. దీనిప్రకారం అభ్యర్థులు ఏదైనా పరీక్షకు ఒకసారి రిజిస్ర్టేషన చేసుకుంటే, వారికి ఒక కోడ్‌ వస్తుంది. అదే నెంబర్‌తో ఏ పరీక్షకైనా కోడ్‌ చేయవచ్చు. ఇప్పటికే అభ్యర్థులు వారి వివరాలన్నీ ఒకసారి దరఖాస్తుచేసుకుని ఉండటం వల్ల, ఆ వివరాలు సర్వర్‌లో సేవ్‌ అయిపోతాయి. అభ్యర్థి మరొక పరీక్షకు దరఖాస్తు పెట్టుకుంటే. ఆ కోడ్‌ను ఎంటర్‌ చేస్తేచాలు. వివరాలన్నీ వచ్చేస్తాయి. అవికాక రెండు, మూడు వివరాలు ఉంటే నమోదు చేయవచ్చు. దీనివల్ల దరఖాస్తుల్లో తప్పులు జరిగే అవకాశాలు చాలా తక్కువ. అభ్యర్థులకు ఎలాంటి టెన్షన ఉండదు. అలాగే దరఖాస్తు పూర్తిచేయటానికి ఎక్కువ సమయం పట్టదు. అభ్యర్థులు దానిని పూర్తిచేసి నేరుగా ఫీజు కడితే సరిపోతుంది.

పరీక్ష, ఎంపిక విధానం ఏవిధంగా ఉంటుంది?
గ్రూప్‌-1లో తప్ప అన్నింటికీ ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలుంటాయి. ఈ ప్రశ్నల్లో నెగిటివ్‌ మార్కు ఉంటుంది. ఒక ప్రశ్న కరెక్టు అయితే ఒక మార్కు, అదే తప్పు అయితే వనబై త్రీ మార్కు కట్‌ అవుతుంది. కొంతమంది అభ్యర్థులు ఏదో ఒకటి పెట్టేస్తారు. దీనివల్ల కష్టపడిన వారికి అన్యాయం జరుగుతుంది. సబ్జెక్టుపై నిజంగా పట్టున్నవాళ్లకి ఇది బాగా ఉపయోగకరం. అలాగే ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే ఫిల్టరైజేషన టెస్ట్‌పెడతాం. గ్రూప్‌-1లో హయ్యర్‌ క్యాడర్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు ఉంటాయి. మిగిలిన పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండవు.

కోచింగ్‌ సెంటర్‌కు వెళ్లిన వాళ్లకే ఉద్యోగాలు అనే ప్రచారం ఉంది? దీన్ని ఎలా చూస్తారు?
కోచింగ్‌ సెంటర్లకు వెళ్లిన వారికే ఉద్యోగాలు వచ్చేవిధంగా పరీక్షా విధానం ఉండదు. మేం నిర్వహించే ఎలాంటి పరీక్ష అయినా సరే అభ్యర్థుల సామర్థ్యాన్ని వెలికితేసే విధంగానే ఉంటుంది. అందరికీ సమానావకాశాలు ఇచ్చేవిధంగా పరీక్ష విధానం ఉంటుంది. కొన్ని కోచింగ్‌ సెంటర్లు, బయటవ్యక్తులు వారి వ్యాపార దృక్పథం కోసమే ఇలాంటి ప్రచారం చేసుకుంటున్నాయి.

ఏటా భర్తీ ప్రక్రియ ఉంటుందా?
ఆర్థికశాఖ ప్రతిపాదించిన ప్రకారం ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇస్తుంది. ప్రస్తుతం ఏపీపీఎస్సీ ద్వారా 4009 ఉద్యోగాలను భర్తీచేస్తున్నాం. ఇక నుంచి క్యాలెండర్‌ ఇయర్‌ను పాటిస్తాం. ప్రతి సంవత్సరం ఏపీపీఎస్సీ ద్వారా ఖాళీలను భర్తీచేస్తాం. ఇప్పుడు ప్రకటించిన వాటిల్లో భర్తీచేసిన తర్వాత మిగిలిన ఖాళీలు, ప్రభుత్వం కొత్తగా ఇచ్చే ఖాళీల వివరాలతో నోటిఫికేషన్స ఇస్తాం. అలాగే క్యాలెండర్‌ ఇయర్‌ను పాటిస్తున్నాం కాబట్టి, ఆరు నెలల్లోపే ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తిచేస్తాం.

ఉద్యోగాలిప్పిస్తామని చాలా మంది మోసం చేస్తుంటారు. దీనిపై మీ సూచనలు?
అభ్యర్థి సామర్థ్యం ఆధారంగానే ఉద్యోగాల భర్తీ ఉంటుంది. ఎవరైనా దళారులు ఉద్యోగాలు ఇప్పిస్తామంటే నమ్మవద్దు. పూర్తిపారదర్శకతతో ఖాళీలను భర్తీ చేస్తాం. భర్తీ ప్రక్రియలో ఎలాంటి లావాదేవీలూ ఉండబోవు. ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తు పెట్టుకోవాలి.

ఏపీపీఎస్సీ ద్వారా పోలీసు ఉద్యోగాలను భర్తీచేస్తున్నారా?
ఏపీపీఎస్సీ ద్వారా పోలీసు ఉద్యోగాలను ప్రస్తుతానికి భర్తీ చేయటం లేదు. గ్రూప్‌-1లో ఉన్న డీఎస్పీ పోస్టులను భర్తీ చేస్తాం. మిగతా పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ఫిట్‌నె్‌సటె్‌స్టలు, తదితర నిబంధనలు ఉంటాయి. ఆ పోస్టులను పోలీస్‌ శాఖే భర్తీ చేసుకుంటుంది.

సిలబ్‌సలో ఏమైనా మార్పులుంటాయా?
ఈరోజు పరిస్థితులకు అనుగుణంగా ప్రతి సిలబ్‌సను రివైజ్‌ చేస్తున్నాం. ఇప్పటికే గ్రూప్‌-1, గ్రూప్‌-2 ముసాయిదా సిలబ్‌సను వెబ్‌సైట్‌లో పెట్టాం. దానికి సంబంధించి చాలా ఫీడ్‌బ్యాక్‌లు వచ్చాయి. ఆ ఫీడ్‌బ్యాక్‌లన్నింటినీ నిపుణుల కమిటీకి ఇచ్చాం. మరో పదిరోజుల్లో వారిచ్చే సలహాలు, సూచనలతో ఫైనల్‌ సిలబ్‌సను తయారు చేసి వెబ్‌సైట్‌లో పెడతాం. పోస్టుల ఖాళీల పరంగా అంతకుముందు ఉన్న సిలబ్‌సలో మార్పులు అవసరమని భావిస్తే మార్పు చేస్తాం. అలాగే చరిత్ర అనేది ఎప్పుడూ చరిత్రే అది ఎప్పటికీ మారదు. భారతదేశ చరిత్ర, ఏపీ చరిత్ర అలానే ఉంటుంది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌, విభజన పరిస్థితులు, తదితర అంశాలను సిలబ్‌సలో చేర్చుతాం.

Source Link : Click Here


from Freshers jobs, walkins, direct recruitment, Recruiting Freshers, Walkins for Experienced http://ift.tt/29gAu5q
via IFTTT
Share this article :

Post a Comment

 
Design Template by panjz-online | Support by creating website | Powered by Blogger